Vu Anna Aa Anna Song lyrics In Telugu | Daari Tappina Manishi Movie Songs | Narasimha Raju | Roopa


 చిత్రం: దారి తప్పిన మనిషి (1981)

సంగీతం: విజయభాస్కర్

సాహిత్యం: వేటూరి

గానం: ఏసుదాస్, సుశీల


ఆమె

ఊఁ అన్నా.. ఆఁ అన్నా

ఉలికి ఉలికి పడతావెందుకు

ఊఁ అన్నా.. ఆఁ అన్నా

ఉలికి ఉలికి పడతావెందుకు

అతడు

అన్నన్నా ఎంత మాట

మనసు దాచి రాగాలెందుకు

ఆమె

ఉన్న తలపు వలపైనప్పుడు

కన్నె మనసు ఏమంటుంది

అతడు

చిలిపి చిలిపి పిలుపులు కన్నుల

నిలిపి తోడు రమ్మంటుంది

ఆమె

కోరికలన్నీ కోయిలలైతే

కొత్త ఋతువు ఏమంటుంది

అతడు

వయసంతా వసంతమై

వలపు వీణ ఝుమ్మంటుంది

ఆమె

పిలుపో తొలి వలపో

మరుపో మైమరుపో

ఊఁ అన్నా.. ఆఁ అన్నా

ఉలికి ఉలికి పడతావెందుకు

అతడు

అన్నన్నా ఎంత మాట

మనసు దాచి రాగాలెందుకు

ఆమె

ఉన్న కనులు రెండే అయినా

కన్నకలలకు అంతే లేదు

అతడు

కన్న కలలు ఎన్నైనా

ఉన్న నిజము మారిపోదు

ఆమె

కోరిన వారు కొంగు ముడేస్తే

కలలు పండి నిజమౌతాయి

అతడు

కల అయినా.. నిజమైనా

కలదు కదా కథ తరువాయి

ఆమె

కలయో.. ఇది నిజమో

కథయో.. వైష్ణవమాయో

ఊఁ అన్నా.. ఆఁ అన్నా

ఉలికి ఉలికి పడతావెందుకు

అతడు

అన్నన్నా ఎంత మాట

మనసు దాచి రాగాలెందుకు

అతడు

నిదురించిన తూరుపులో

నీవేలే పొద్దుపొడుపు

ఆమె

నిను కోరిన నా తలపులలో

నీకేలే ముద్దుల ముడుపు

అతడు

అన్నా నేవిన్నా ఔనన్నా కాదన్నా

ఆమె

అవునంటే నీతో ఉన్నా

కాదన్నా నీలో ఉన్నా

అతడు

ఊఁ అన్నా ఆఁ అన్నా

ఉలికి ఉలికి పడతావెందుకు

ఆమె

అన్నన్నా ఎంత మాట

మనసు దోచి రాగాలెందుకు

ఇద్దరు

ఆహాహాహహా ఆహాహాహహా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు